భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల్లో ఉద్యోగాల కోత పర్వం కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 5 శాతం మందిని తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వ్యాపారాన్ని విస్తరించేందుకు గేమింగ్, పాడ్‌కాస్ట్‌లు, లైవ్ ఈవెంట్ల వైపు అడుగులు వేస్తున్న నెట్‌ఫ్లిక్స్, వ్యయాలను అదుపులో ఉంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

'పక్' (Puck) న్యూస్‌లెటర్ నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ వచ్చే వారంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కథనాలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16,000 మంది పూర్తికాల ఉద్యోగులు ఉండగా, వారిలో 68 శాతం మ...