భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్‌లైన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే మూడు రోజుల ఆలస్యంగా ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ ఆన్‌లైన్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల కన్వీనర్ గాజర్ల రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా పరీక్ష తేదీలో ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నారు.

పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఈ నెల 17వ తేదీ నుంచి తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్( https://tgtet.aptonline.in/ ) ద్వారా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సూచించారు. ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనకు గురికావద్ద...