భారతదేశం, ఆగస్టు 29 -- పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలోని వరంగల్, ఏపీలోని విజయవాడ మార్గం గుండా ప్రయాణిస్తాయి.

కాన్పూర్ సెంట్రల్ - మధురై ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01925) ప్రతి బుధవారం ఉదయం 08:10 గంటలకు కాన్పూర్ సెంట్రల్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది. 02 సెప్టెంబర్ 2026 నుండి 25 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

మధురై - కాన్పూర్ సెంట్రల్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01926) ప్రతి శనివారం అర్ధరాత్రి దాటాక 02:30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. 05 సెప్టెంబర్ 2026 నుండి 28 నవంబర...