భారతదేశం, సెప్టెంబర్ 13 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన కానుకల వేలానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం (E-Auction) ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ వేలం ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబరు 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగుతుంది. ఈ సారి వేలంలో ప్రధానంగా కొత్తవి అయిన ఆర్ట్ సిల్క్ చీరలను ఉంచారు. మొత్తం 132 లాట్లుగా వీటిని విభజించి ఆన్‌లైన్ వేలానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యాపారులు, భక్తులు, సాధారణ ప్రజలు ఈ-వేలంలో పాల్గొని తమకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు.

ఈ-వేలానికి సంబంధించిన మరింత సమాచారం, నిబంధ...