భారతదేశం, జూలై 4 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ (DSH-APVVP) తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. థియేటర్ అసిస్టెంట్ 1 పోస్ట్, రికార్డ్ అసిస్టెంట్ 1, ప్లంబర్ 1, GDA/MNO/FNO 6 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 పోస్టులు ఉన్నాయి.

అన్ని పోస్టులకు అభ్యర్థులు కనీసం ఎస్ఎస్‌సీ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్లంబర్ పోస్టుకు అదనంగా ఐటీఐ ప్లంబింగ్/ఫిట్టర్/మెకానిక్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరా...