భారతదేశం, అక్టోబర్ 15 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ సరస్ మేళా-2026 వేడుకలు విజయవాడ నగరం వేదికగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పున్నమి ఘాట్ ప్రాంగణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ఈ జాతీయ మేళాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా ప్రారంభించారు.

ఈ నెల 15 నుండి అక్టోబర్ 31 వరకు దాదాపు 14 రోజుల పాటు ఈ మేళా ప్రజలకు అందుబాటులో ఉండనుంది. మేళా ప్రారంభం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలు(SHG) ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. గ్రామీణ చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు...