భారతదేశం, నవంబర్ 2 -- పండుగల సీజన్‌లో ప్రయాణికుల రాకపోకలు, విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. చర్లపల్లి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య ప్రత్యేక పూజా పండుగ రైళ్లను (Puja Festival Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం అధికారిక ప్రత్రికా ప్రకటన విడుదల చేసింది.

పండుగల వేళ సొంత ఊళ్లకు, చెన్నై మార్గానికి ప్రయాణించే వారి సౌకర్యార్థం నడిపే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఇరు మార్గాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

07059 చర్లపల్లి - చెన్నై సెంట్రల్ రైలు 06.11.2026 రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుస...