భారతదేశం, జూన్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాకు 4 లక్షల 20 వేల ఆర్డర్ రావడంతోపాటు 20 వేలు అడ్వాన్స్ ఇస్తారు. అన్ని పనులతో కలిపి 70 వేలు అవుతుందని, ఆ డబ్బును రవి, శ్రుతి దగ్గర అడుగుదామని బాలు, మీనా అనుకుంటారు.

మరోవైపు రవి, శ్రుతి సినిమా చూస్తారు. రవికి నచ్చితే శ్రుతికి నచ్చదు ఆ సినిమా. దాని గురించి ఇద్దరు గొడవ పడుతుంటారు. అంతలో బాలు, మీనా వచ్చి అడిగితే.. ఫైటింగ్ జరుగుతుందని రవి అంటాడు. తర్వాత 4 లక్షల ఆర్డర్ గురించి చెప్పి ఇంకా 40 వేలు తక్కువ పడుతుందని, ఆ డబ్బు కావాలని బాలు, మీనా అడుగుతారు.

దానికి రవి, శ్రుతి ఇద్దరం ఇస్తామని గొడవ పడతారు. తర్వాత చెరో 20 వేలు ఇస్తామని చెబుతారు. ఏది కావాలన్న మొహమాట పడొద్దుని మీనాతో శ్రుతి అంటే.. చిన్నప్పుడు నేను చదువుకోడానికి కష్టపడ్డ...