భారతదేశం, మే 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు తనమీద అసూయ అని మనోజ్ చెప్పడంతో మీనా విరుచుకుపడుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరికి ఇచ్చిపడేస్తుంది. ఆ షాపు తక్కువ ధరకు బాలునే పెట్టించిందని, మళ్లీ పార్కులో ఎక్కడ మనోజ్ పడుకోవాల్సి వస్తుందనో సత్యంని యజమానిగా కూర్చోబెట్టారని మీనా అంటుంది.

మావయ్య గారి కష్టాన్ని తీసుకుని షాప్ పెట్టుకున్నారు. బాలు చిటిక వేసి ఆ కుర్చీలో కూర్చోగలడు. లేదా రవిని కూర్చొబెట్టగలడు. ఆ షాప్ మీద వచ్చిన డబ్బును ఖర్చు అయిపోయింది. ఇక మీకు ఏ సంబంధం లేదని కూడా అనగలడు. కానీ, గౌరవంగా ఇంటి యజమానిని షాప్ ఓనర్‌గా కూర్చోబెట్టాడని శ్రుతి మద్దతు ఇస్తుంది. నీకు ఏం తెలుసుని మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది.

మీకు ఏం తెలియదని ఇంకా వెనుకేసుకొస్తున్నారు. మీరు ఇలా చేయవట...