భారతదేశం, నవంబర్ 21 -- ఆటోమొబైల్ దిగ్గజం హోండా సరికొత్త 'అవాన్సియర్' (Avancier) మూడు వరుసల ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. నవంబర్ 20, 2026న అంతర్జాతీయంగా ఆవిష్కరించిన ఈ కారులో నెక్స్ట్-జెనరేషన్ 2.0-లీటర్ హైబ్రిడ్ వ్యవస్థ, ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సదుపాయాలను కల్పించింది. ఆరు సీట్ల క్యాబిన్, కొత్త ప్లాట్‌ఫామ్, ఆధునిక సాంకేతికతతో ఈ ఎస్‌యూవీని తీర్చిదిద్దింది.

హోండా సంస్థ తన నెక్స్ట్-జెనరేషన్ హైబ్రిడ్ వ్యవస్థతో పాటు సరికొత్త 'హెచ్' (H) లోగోను ఉపయోగించిన తొలి మోడల్ ఇదే కావడం విశేషం. త్వరలోనే థాయ్‌లాండ్, జపాన్, చైనా మార్కెట్లలోకి ఈ కారు అడుగుపెట్టనుంది. ఆస్ట్రేలియాలో 2027 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభించేందుకు హోండా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, భారత్‌లో దీని విడుదలపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయ...