భారతదేశం, జూలై 23 -- The End Of Oak Street Telugu Trailer Released: హాలీవుడ్ తెరపై డైనోసార్ల హంగామా అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ పండగే. 'జురాసిక్ పార్క్', 'జురాసిక్ వరల్డ్' సిరీస్‌ల తర్వాత మళ్లీ ఆ స్థాయి విజువల్ వండర్‌తో మైండ్ బ్లాక్ చేయడానికి వచ్చేస్తోంది 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' (The End of Oak Street).

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తెలుగులో కూడా విడుదల చేశారు. ఊహించని రోదసి ప్రమాదం కారణంగా ఒక వీధి మొత్తం వింత ప్రదేశంలోకి కొట్టుకుపోవడం, అక్కడ తిరిగే అతి భారీ డైనోసార్ల మధ్య ఓ కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి పడే తపనతో ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది.

ఈ కథలో ప్లాట్ (Platt) కుటుంబం చుట్టూ జరిగే సంఘటనలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి...