భారతదేశం, అక్టోబర్ 9 -- తెలంగాణ పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సహా దేవీ నవరాత్రుల వేడుకలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించి, ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ మార్గంలో ఏకంగా 34 రోజువారీ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ పండుగ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 09వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చని సూచించింది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్...