భారతదేశం, జూలై 1 -- వినియోగదారులకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా Telangana Southern Power Distribution Company Limited(TGSPDCL) బుధవారం నుంచి ఒక కీలకమైన డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను మెుదలుపెట్టింది. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక లోపాలను వేగంగా గుర్తించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

మొదటి దశలో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఈ డిజిటల్ మ్యాపింగ్‌ను అమలు అవుతుంది. ఈ సరికొత్త విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగదారుడి ఇంటి వరకు ఉండే పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్‌గా అనుసంధానం చేస్తారు.

132/33 కేవీ ఈహెచ్‌టీ (EHT) సబ్‌స్టేషన్ల నుండి 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTR) మీదుగా.. ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్...