భారతదేశం, మే 30 -- Emilia Clarke On OTT Series Game Of Thrones Remuneration: హాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones). ఈ ఓటీటీ సిరీస్‌లో నటించిన నటీనటులు, ముఖ్యంగా 'మదర్ ఆఫ్ డ్రాగన్స్' (డ్రాగన్ల తల్లి) పాత్ర పోషించిన ఎమిలియా క్లార్క్ పారితోషికంపై గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ వెబ్ సిరీస్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎమిలియాతో పాటు తోటి నటీనటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా 3 లక్షల డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 2.8 కోట్లు) అందుకున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ సుదీర్ఘ అంచనాలపై 39 ఏళ్ల ఎమిలియా క్లార్క్ తాజాగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు.

వెరైటీ (Variety) మ్యాగజైన్‌కు ఇచ్చిన త...