ఎట్టకేలకు ఆగస్టులో అందుబాటులోకి రానున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్!
భారతదేశం, జూలై 9 -- హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అడ్డంకులను అధిగమించి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఫ్లైఓవర్‌ను వచ్చే ఆగస్టు నెలలో ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు ప్రయాణించే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఒక వరంలా మారనుంది. సుమారు 2.8 కిలోమీటర్ల పొడవుతో, నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ ప్రయాణికులకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా సాఫీగా సాగిపోయే మార్గం సుగమం కానుంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కేర్ణన్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.