భారతదేశం, జూలై 9 -- హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అడ్డంకులను అధిగమించి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఫ్లైఓవర్‌ను వచ్చే ఆగస్టు నెలలో ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు ప్రయాణించే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఒక వరంలా మారనుంది. సుమారు 2.8 కిలోమీటర్ల పొడవుతో, నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌ ప్రయాణికులకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా సాఫీగా సాగిపోయే మార్గం సుగమం కానుంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కేర్ణన్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్ట్...