భారతదేశం, మే 11 -- దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు అండగా ఉన్న 'ఉపాధి హామీ పథకం' (MGNREGA) ఇకపై కొత్త రూపంలో, మరింత పటిష్టంగా దర్శనమివ్వనుంది. కొత్తగా తీసుకువచ్చిన VB-GRAM G చట్టం, 2025ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు కల్పించే కనీస పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరాలను వెల్లడించారు.

ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం నిధుల కేటాయింపు ఇలా..

మొత్తం బడ్జెట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో కలిపి మొత్తం రూ. 1.51 లక్షల కోట్లు.

కేంద్ర వాటా: సుమారు రూ. 95,000 కోట్లను కేంద్రం కేటాయించింది.

నిర్వహణ ఖ...