భారతదేశం, జూలై 4 -- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక విమానాన్ని వేలం వేసింది. రూ. 792 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా, సీజ్ చేసిన 'హాకర్ 800A' ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ రూ. 3 కోట్లకు విజయవంతంగా విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన 'క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్' (ఫాల్కన్ గ్రూప్), దాని ప్రమోటర్లపై నమోదైన కేసులో భాగంగా ఈ విమానాన్ని జప్తు చేశారు. జూలై 1, 2026 న ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో MSTC ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు.

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల ప్రకారం, 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఈ ప్రైవేట్ జెట్‌ను సీజ్ చ...