భారతదేశం, అక్టోబర్ 4 -- Hyderabad Army Weapons Theft Case : హైదరాబాద్‌లోని బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో సంచలనం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో మల్కాజ్‌గిరి పోలీసులు శనివారం కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి విధుల్లో ఉన్న ముగ్గురు ఆర్మీ ఉద్యోగులతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు మల్కాజ్‌‌గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వెల్లడించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ ఉప్పుతల మల్లేష్ (37)ను పోలీసులు సెప్టెంబర్ 11నే అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మల్లేష్, ఆగస్టు 30, 31 తేదీల మధ్యరాత్రి బొల్లారంలోని 'కోటె అండ్ బెటాలియన్ మ్యాగజైన్' నుంచి అత్యాధునిక ఏకే-203 అస్సాల్ట్ రైఫిళ్లు, భారీగా మందుగుండు సామగ్రిని దొంగిలించాడు. అనంతరం ఆ ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని తన తండ్రి నివాసంలో దాచిపెట్టాడు. పోలీసులు...