భారతదేశం, మే 13 -- SCR Tirupati Okha Express : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి గుజరాత్‌లోని ద్వారకా సమీపంలో ఉన్న ఓఖా వరకు కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ.. తిరుపతి - ఓఖా - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 19559/19560) రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

ఈ వీక్లీ ట్రైన్స్‌ తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

ఈ రైలు అందుబాటులోకి రావటంతో.. తిరుపతి నుంచి ద్వారకా వెళ్లే యాత్రికులకు, అల...