భారతదేశం, అక్టోబర్ 5 -- పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని తిన్‌సుకియా-కర్ణాటకలోని ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, విజయవాడ, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

ఈ ప్రత్యేక సర్వీసులు మొత్తం 6 ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ కింద పేర్కొన్న సమయాలు, స్టేషన్ల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.

అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 12, 2026 వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు తిన్‌సుకియాలో బయలుదేరుతుంది. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు దువ్వాడ చేరుకుని, 3.25 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 09.30 ...