భారతదేశం, జూన్ 21 -- తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను వాహన్ డేటాబేస్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో ట్రాఫిక్ ఈ-చలాన్లు, రవాణా శాఖ పంపే అధికారిక నోటీసులు మీకు అందకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ మేరకు రవాణా శాఖ అధికారులు 'వాహన్' పోర్టల్ ద్వారా ఒక అధికారిక మార్గదర్శకాన్ని విడుదల చేశారు. చాలా మంది వాహనదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో ఒక మొబైల్ నంబర్ ఇస్తారని, ఆ తర్వాత కాలంలో నంబర్లు మార్చినా.. ఆ కొత్త వివరాలను రవాణా శాఖ సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ నోటీసులు పాత ఫోన్ నంబర్లకే వెళ్తున్నాయి.

ఫలితంగా, తమ వాహన...