భారతదేశం, అక్టోబర్ 8 -- గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరొక విడత ఉద్యోగాల కోతకు తెరలేపింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడం, కార్పొరేట్ స్థాయిలో అనవసరమైన నియంత్రణలను తొలగించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలన్న సీఈఓ యాండీ జెస్సీ వ్యూహంలో భాగంగానే ఈ లేఆఫ్‌లు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ లేఆఫ్స్ ప్రధానంగా కస్టమర్ సర్వీస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్, రీటైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో చోటుచేసుకున్నాయి. మంగళవారం నుంచే బాధితులు తమకు అందిన సమాచారాన్ని కంపెనీ అంతర్గత స్లాక్ (Slack) ఛానెళ్లలో పంచుకోవడం ప్రారంభించారు.

ప్రధాన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే 'స్టోర్స్' (Stores) విభాగంలో మార్పుల వల్లే కొద్ది సంఖ్యలో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని అమెజాన్ ప్రతి...