భారతదేశం, జూలై 8 -- అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL), అమరావతిలోని నెలాపాడు సమీపంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం నిర్మాణం కోసం, డిజైన్-బిల్డ్ లంప్-సమ్ కాంట్రాక్టు పద్ధతిలో రూ.14 కోట్లకు పైగా విలువైన పోటీ టెండర్‌ను ఆహ్వానించింది. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులో రెండేళ్ల లోప బాధ్యత కాలం(Defect Liability Period) కూడా ఉంది. ఈ కాలంలో కాంట్రాక్టర్ లోపాలను సరిదిద్దడం, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.

బిడ్ పత్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్‌లు, అంతర్గత, బాహ్య విద్యుత్ వ్యవస్థలు, ప్లంబింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక సౌకర్యాలు, లిఫ్టులు, డీజిల్ జనరేటర్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC), భద్రతా వ్యవస్థలు, బాహ్య అ...