భారతదేశం, సెప్టెంబర్ 18 -- Zombie Reddy 2 Upendra: టాలీవుడ్‌లో సరికొత్త జాంబీ కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' (Zombie Reddy 2: Nxt Lvl) రూపొందుతోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

తేజ సజ్జా హీరోగా రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' ఒకటి. ఈ క్రేజీ సీక్వెల్‌లోకి కన్నడ అగ్ర నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర అడుగుపెట్టారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

జాంబీ రెడ్డి 2 నుంచి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడ...