భారతదేశం, జూన్ 9 -- కాశ్మీర్ లోయను లద్దాఖ్‌తో అనుసంధానించే వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హిమాలయ పర్వత శ్రేణులను చీల్చుకుంటూ సాగుతున్న ఈ సొరంగ మార్గంలో చివరి 2.5 మీటర్ల భాగాన్ని విజయవంతంగా పేల్చివేయడంతో ప్రధాన సొరంగం రెండు అంచులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. నిర్దేశిత గడువు కంటే 6 నెలల ముందే ఈ అద్భుత మైలురాయిని (బ్రేక్‌థ్రూ) అధిగమించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్, ద్విదిశాత్మక (బై-డైరెక్షనల్) బైపాస్ రహదారి సొరంగంగా ఇది రికార్డు సృష్టించబోతోంది.

లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని మీనామార్గ్‌లో ఉన్న ఈస్ట్ పోర్టల్ వద్ద కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి ఈ తుది పేలుడును ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ స...