భారతదేశం, మార్చి 11 -- తెలుగు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి అయిన జీ5లో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఈ ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా సాధించింది ఈ తెలుగు వెబ్ సిరీస్.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన నేపథ్యంలో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ5 ఓటీటీ తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెస...