భారతదేశం, జూలై 16 -- Shivlok Ke Kundakka Mandakka OTT Release On Zee5: ఎప్పటిక‌ప్పుడు వినూత్న‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించే జీ5 ఓటీటీ పిల్లల కోసం సరికొత్త సిరీస్‌ను తీసుకు రానుంది. పిల్ల‌ల‌కు ఇష్టమైన, సుర‌క్షిత‌మైన‌, హాస్యాన్ని అందించేలా కిడ్స్ జెడ్ (KidZ).. కంటెంట్‌ను డిజైన్ చేసే ప్ర‌దేశంగా మారింది.

తాజాగా దీన్ని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తూ మ‌రో స‌రికొత్త యానిమేటెడ్ ఓటీటీ సిరీస్ 'శివలోక్ కె కుండక్క మండక్క' (SKM) ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ ఆనంద్ నీలకంఠన్ రాసిన అత్య‌ధికంగా అమ్ముడైన పిల్ల‌ల పుస్త‌కం ' ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫ‌ర్ కిడ్స్‌' ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ రూపొందింది.

ఇద్దరు బాల అసురులు హీరోలుగా మారడం, వారి అమాయకత్వం, చేష్టలు, మంచి మనసు వంటి అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జీ5లో జూలై 17 నుంచి అం...