భారతదేశం, నవంబర్ 27 -- Zee5 OTT Release Movie Dalimb: డిజిటల్ ఆడియెన్స్ కోసం మరో విభిన్న కథాంశాలతో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే దాలింబ్. ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో దాలింబ్ ఓటీటీ సినిమాకు ప్రియా అవెన్‌ దర్శకత్వం వహించారు.

జితేంద్ర కుమార్‌, ప్రియ బాపట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ దాలింబ్ ట్రైలర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ముంబయి శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం కావడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ కథ తిరుగుతుంది.

ఈ రెండు కేసుల దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దాలింబ్ సినిమా సాగుతుంది. జితేంద్ర...