భారతదేశం, ఏప్రిల్ 24 -- Center Advice Zee5 OTT Release Lawrence Of Punjab: పంజాబ్ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ సంస్కృతి, నేర సామ్రాజ్యాల విస్తరణ అనేది అత్యంత సున్నితమైన అంశం. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎదుగుదలను చూపిస్తూ రూపొందించిన ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'. ఏప్రిల్ 27 న లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే, ఈ ఓటీటీ సిరీస్ విడుదలయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పంజాబ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను గొప్పగా చూపించడం వల్ల యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని వారు కేంద్రానికి నివేదించారు. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5కి ఈ సిరీస్ విడుదల చేయవద్దని అడ్వైజరీ జారీ చేసింది.

ఈ ఓటీటీ డాక్యూ సిరీస్‌పై పంజ...