భారతదేశం, జూన్ 13 -- ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన. 16,000 పోస్టుల 'మెగా డీఎస్సీ' ఒక 'మెగా స్కామ్' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు . ఈ నియామకాల వెనుక ఒక పక్కా ప్రణాళికతో కూడిన చీకటి ఆపరేషన్ జరిగిందని, ఇది లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను నట్టేట ముంచిందన్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ లో. పలు ఆధారాలను.. జీవో కాపీలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ ఈ కుంభకోణానికి కారకులైన పెద్దల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి. ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు నిరుద్యోగుల ముందుకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Published by HT Digital Content Services...