భారతదేశం, జూన్ 28 -- రాజధాని ప్రాంతమైన అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని బాధితులు, రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల వాహనశ్రేణిపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నడుపుతోంది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక గూండాల రాజ్యమా అని ఆయన నిలదీశారు.

పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విపక్ష నేతలపై దాడులు చేయించడం అత్యంత దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. అమరావతి పేరుతో సాగుతున్న భారీ అవినీతి, భూ దోపిడీ, రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతోనే చంద్రబాబు ఈ దాడులను ఉ...