భారతదేశం, జూన్ 1 -- Yogandhra 2026 : రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈ ఏడాది 'యోగాంధ్ర-2026' పేరుతో మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' (Yoga for Healthy Aging) అనే విశిష్ట నినాదంతో జూన్ 21న జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రజల్లో ఆరోగ్యం, యోగా పట్ల విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ మేరకు అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తి వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా, వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 'ఏపీ యోగా ప్రచార పరిషత్' ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ద్ర...