భారతదేశం, నవంబర్ 23 -- వైఎస్ షర్మిలను యలహంక ప్యాలెస్ వైపు వెళ్లకుండా బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న షర్మిలతో పోలీసులు మాట్లాడారు. తల్లి విజయమ్మ, కుమారుడు, కోడలితో కలిసి షర్మిల అటువైపు వెళ్లాలని అనుకున్నారు. కానీ కోర్టు సూచనలు పాటించాలని పోలీసులు సూచించారు. విమానాశ్రయం నుంచి ఆమె బయటకు వచ్చిన తర్వాత.. యలహంక సైడ్ వెళ్లకుండా.. వేరే వైపు వాహనాలను మళ్లించారు. దీంతో పోలీసులతో ఆమెకు వాగ్వాదం జరిగింది. చివరకు ఓ ప్రైవేటు హోటల్‌కు షర్మిల వెళ్లారు. అధికారులు ఆమెకు కోర్టు ఉత్తర్వుల గురించి వివరించి, ముందుకు వెళ్లకుండా నివారించారని పోలీసు వర్గాలు చెప్పాయి.

షర్మిల కుటుంబ సభ్యులు, ఏజెంట్లు, ప్రతినిధులు, ఆమె తరఫున వ్యవహరించే ఇతరులు యలహంక ప్రాపర్టీలోకి అనుమతించకూడదని కోరుతూ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖల...