భారతదేశం, ఏప్రిల్ 25 -- ఆవలింత అనేది రోజులో చాలాసార్లు వస్తుంటుంది. నిద్ర వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, కొన్నిసార్లు బోర్‌గా ఉన్నప్పుడు.. మరికొన్నిసార్లు ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా కూడా ఆవలింత వస్తుంది. దీనిని చాలావరకు నిద్రతో కనెక్ట్ చేసి మాట్లాడుతాం. ఇది సాధారణ శారీరక చర్య. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆవలింత తర్వాత వెంటనే చుట్టుపక్కల శబ్దాలు స్పష్టంగా, బిగ్గరగా వినిపిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

మన చెవుల లోపల యూస్టాకియన్ ట్యూబ్ అని పిలిచే ఒక చిన్న గొట్టం ఉంటుంది. ఈ గొట్టం మన మధ్య చెవిని గొంతుకు కలుపుతుంది. సాధారణంగా ఇది మూసి ఉంటుంది. మనం ఆవలిస్తున్నప్పుడు, నోరు, దవడ సంకోచించడం వల్ల ఈ గొట్టం తెరుచుకుంటుంది. ఇది చెవి లోపల, బయట గాలి పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. కర్ణభేరి సరిగ్గా కంపించడం మొదలవుతుంది. దీంతో శబ్దాలు ...