భారతదేశం, మార్చి 28 -- మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్న మరో కొత్త సినిమా బరి. ఈ సినిమాలో తన అన్న, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించనున్నారు.

రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న బరి సినిమా పూజా కార్యక్రమాలను ఇవాళ శనివారం (మార్చి 28) నాడు నిర్వహించారు. బరి సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూ...