భారతదేశం, సెప్టెంబర్ 11 -- Worms In Bipasha Basu Protein Powder Raise Food Safety: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఆహార కల్తీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన ఐసోప్యూర్ (Isopure) ప్రోటీన్ పౌడర్ డబ్బా తెరిచి చూడగా అందులో చిన్న చిన్న పురుగులు సంచరిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు.

ఈ తీవ్రమైన వ్యవహారంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్, 'రియల్ లైఫ్ సింగం'గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను బిపాషా బసు ట్యాగ్ చేసి తన ఆవేదన పంచుకున్నారు. ఈ వీడియోలో తన వేలిపై పురుగును చూపిస్తూ బిపాషా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"ఈ కొత్త డబ్బా నిండా చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి. మనం కొనుగోలు చేసే ప్రతీ వస్తువులో కల్తీ లేకుండా శుభ్రమైన ఉత్పత్తులు అందాలంటే మీరే మాకు ఏకై...