భారతదేశం, ఏప్రిల్ 29 -- West Bengal Exit poll 2026: పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.

రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.

టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.

ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ...