Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన! ఐఎండీ అంచనాలివే
భారతదేశం, ఆగస్టు 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం బలపడనుంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల పరిధిలో శనివారానికి (ఆగస్టు 29, 2026) ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల కొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాల సమయంలో ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.