భారతదేశం, మార్చి 1 -- మార్చి 1 ఆదివారం నుండి హైదరాబాద్ తీవ్రమైన వేసవిని చూడబోతోంది. అయితే భారత వాతావరణ శాఖ(IMD) ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా వేసింది. మార్చి 3-7 మధ్య ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య, హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల పరిధిలో ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39-41 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఇతర జిల్లాల్లో 37-39 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీతోపాటుగా రాష్ట్రంలోని ఇతర జిల్ల...