Weather Update : తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 20 -- నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుంది.
ప్రస్తుతం ఉన్న ఆవర్తనం బలపడి ఈ నెల 24 లేదా 25 నాటికి అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం అక్టోబర్ 27 నాటికి మరింత తీవ్రమై వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశముంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో ఇది సైక్లోన్‌గా రూపాంతరం చెంది, నెలాఖరు నాటికి ఉత్తర కోస్తాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై స్పష్టత రావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.