భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వాటర్ టూరిజం విస్తరణపై దృష్టి సారించింది. హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటికే 120 సీట్ల సామర్థ్యం కలిగిన ముచుకుంద డబుల్ డెక్కర్ క్రూజ్ బోట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరు ప్రధాన జలాశయాల్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, లగ్జరీ డైన్-ఇన్ క్రూజ్ బోట్లు, హౌస్‌బోట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్షిప్ (PPP) నమూనాలో వీటిని అభివృద్ధి చేసి, నిర్వహించడానికి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రైవేట్ సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది.

ప్రతిపాదిత ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, క్రూయిజ్ బోట్లు హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం చెరువు, కోకాపేట సరస్సు, మల్కం చెరువుల వద్ద ఏర్పాటు కానున్నాయి. కాగా నాగార్జునసాగర్, సోమశిల, రామప్ప సరస్సుల వద్ద హౌస్‌బోట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ప్ర...