Water Metro : విజయవాడ టూ అమరావతి వాటర్ మెట్రో.. కృష్ణా నదిపై ప్రయాణం
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, బెజవాడ వాసులకు ఏపీ ప్రభుత్వం సరికొత్త, పర్యావరణహిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. కొచ్చి వాటర్ మెట్రో విజయవంతమైన నేపథ్యంలో, అదే తరహాలో కృష్ణా నది ఆధారంగా విజయవాడ నుండి అమరావతిని అనుసంధానిస్తూ వాటర్ మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(IWAI) నుంచి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
APIWA చైర్మన్ శివప్రసాద్.. ఐడబ్ల్యూఏఐ చైర్మన్ సుశీల్ కుమార్ లోహానీకి ఇటీవల రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం, త్వరలోనే ఒక అధ్యయన బృందాన్ని పంపించి ప్రాథమిక సర్వే జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మూడు జాతీయ జలమార్గాలు (NW-4, NW-79, NW-104...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.