భారతదేశం, జూన్ 15 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో పర్యావరణ అనుకూల ఇంధన సాంకేతికత వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. దేశంలో ఇథనాల్ ఇంధన వినియోగాన్ని పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త 'వ్యాగన్​ఆర్ బయోఫ్లెక్స్' కారు ధరను అధికారికంగా ప్రకటించింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రకారం దీని ధరను రూ. 7.24 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ హ్యాచ్‌బ్యాక్ కారును వ్యాగన్​ఆర్ టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్​ఎక్స్​ఐ+ 1.2 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆధారంగా రూపొందించారు.

అయితే, సాధారణ కస్టమర్లకు ఈ కారు ఇప్పుడే దొరకదు! దీనిని కేవలం కమర్షియల్ (టాక్సీ/ట్రాన్స్‌పోర్ట్) కొనుగోలుదారుల కోసం మాత్రమే కంపెనీ ప్రత్యేకంగా లాంచ్ చేసింది.

ధర విషయానికి వస్తే.. ఈ కొత్త వ్యాగన్​ఆర్ బయోఫ్లెక్స్ మోడల్, ప్రస్తుత సాధారణ వ్యా...