భారతదేశం, మార్చి 26 -- ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను "ఏకశిలా నగరం"గా కూడా పిలుస్తారు.

నేటి(మార్చి 26 ) నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహిస్తారు.

సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప...