భారతదేశం, నవంబర్ 21 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త మోడల్‌ని రెడీ చేస్తోంది. తమ పాపులర్ వీ80 లైనప్‌లో సరికొత్తగా 'వివో వీ80 ఎఫ్​ఈ' ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్‌లో ఈ ఫోన్ అందుబాటుపై వివో ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ హ్యాండ్‌సెట్ దర్శనమిచ్చింది. దీన్నిబట్టి మన దేశంలోనూ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలకు ముందే భారత వేరియంట్ రంగులకు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

ఈ నేపథ్యంలో ఈ వివో వీ80 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్యాషనేట్‌గీక్స్ (PassionateGeekz) బ్లాగ్‌లో టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించిన వివరా...