Visakhapatnam Earthquake : విశాఖలో స్వల్ప భూప్రకంపనలు - పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
భారతదేశం, జూలై 12 -- Visakhapatnam Earthquake : విశాఖపట్నం నగర ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం సుమారు 5:08 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న పలువురు స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడంతో కంగారుగా రోడ్లపైకి పరుగులు తీశారు. తీరప్రాంత పరిసరాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కాస్త స్పష్టంగా కనిపించింది.
ఈ ప్రకంపనలకు సంబంధించి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.