భారతదేశం, జూన్ 30 -- Visakhapatnam CII Summit 2026 : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కురిపించడమే కాకుండా, నూతన ఆలోచనలకు, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలిచేలా ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సును నిర్వహించడానికి ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాలతో ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సదస్సును "Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World" అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వ...