భారతదేశం, అక్టోబర్ 19 -- Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali: టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'రణబాలి'. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది.

ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌తీ షోకు సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే ఈ సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. రణబాలి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో రూ. 36.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది. ఆయ‌న ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా 'రణబాలి'లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ...