భారతదేశం, మే 27 -- Virat Anushka: ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్ తో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టేడియంలో కూర్చొని తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్‌సీబీ జట్టును ఎంకరేజ్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అనుష్కను విరాట్ హగ్ చేసుకోవడం వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయానందంలో విరాట్ కోహ్లీ నేరుగా అనుష్క ఉన్న వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆమెను ప్రేమతో గట్టిగా హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విరాట్, అనుష్క శర్మల మధ్య ఉన్న అన్యోన్యత, కెమి...